Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సోమువీర్రాజు.. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి..? అని మండిపడ్డారు.. విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం.. ఈ తరహా సంఘటనలకు ఎవరు సూత్రధారి..? అంటూ నిలదీశారు.. ముస్లింల…
Bommireddy Raghavendra Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. అయితే, ఇప్పుడు టీడీపీకి షాక్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అందులో భాగంగా త్వరలోనే ఆత్మకూరు టీడీపీ నేత, మాజీ జడ్పీ చైర్మన్…
Karumuri Nageswara Rao: గత ప్రభుత్వ అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. అయితే, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరవు.. ఇక, చంద్రబాబు అవినీతి మొత్తం బట్టబయలు అవుతుందన్నారు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు.. చంద్రబాబు…
CM YS Jagan: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించబట్టే మీ ఇంటి ముందు నిలబడి ఆశీర్వదించమని అడగగలుగుతున్నా.. ఆ అడిగే అర్హతకాని, నైతికత కాని, మీ బిడ్డ మీరిచ్చిన అధికారంతో దేవుడి దయతో మెండుగా మంచి చేయగలిగాడని చెప్పగలుగుతున్నా.. ఇదే మాటలను చంద్రబాబు అడగగలరా? అనగలరా? చంద్రబాబు మీకు ముఖం చూపించగలడా? అంటూ ఫైర్…
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “సిట్” పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.. గత ప్రభుత్వ అవినీతిపై ‘సిట్’ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటుపై ‘స్టే’ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు ఇచ్చింది.. ఈ సందర్భంగా హైకోర్టు…
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.. గత ప్రభుత్వం (చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం) నిర్ణయాలపై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌నేతృత్వంలోని ఏపీ సర్కార్.. అయితే, ‘సిట్’ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా సవాల్ చేయగా.. సిట్’పై స్టే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇక, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైఎస్ జగన్…
పుదుచ్చేరిలో రజనీకాంత్ అభిమాన సంఘం నేతల సమావేశం అయ్యారు. ఏపీ మంత్రి రోజాకు.. రజనీకాంత్ అభిమానుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రజనీకాంత్ ను విమర్శించే స్ధాయి రోజాకు లేదని హితవుపలికారు..
Balineni Srinivasa Reddy: మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి…
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు..