CM YS Jagan To Visit Vizag: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమీక్షా సమావేశాలు.. మరోవైపు జిల్లా పర్యటనలు, ఇంకో వైపు సంక్షేమ పతకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాలుపంచుకుంటున్నారు.. అయితే, రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. ఈ సారి వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు..
Read Also: Lotus Pond Hyderabad: చేపలు చస్తున్నాయ్.. వాసనకు ముక్కులు పోతున్నాయ్
సీఎం జగన్ విశాఖ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి విశాఖకు బయలుదేరనున్న సీఎం జగన్.. 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియానికి చేరుకోనున్నారు.. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరణలో పాల్గొననున్న ఆయన.. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవలోని అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.. ఇక, సాయంత్రం 5.50 గంటలకు వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియంను ప్రారంభించనున్నారు సీఎం.. రామ్ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ శంకుస్ధాపనలో పాల్గొంటారు. సాయంత్రం 6.15 గంటలకు ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు వెళ్తారు.. రాత్రి 8.20 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.