Sudhakar Babu: టీడీపీ అధినేత చంద్రబాబు నికృష్ణ రాజకీయాలకు సమాధానం చెప్పగలిగే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డే అన్నారు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు పేదల ఇళ్ళకు ఎందుకు అడ్డుపడుతున్నారు? అంటూ మండిపడ్డారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను చంద్రబాబు అంటరాని వారిగా చూస్తున్నాడని విమర్శించారు.. మా వర్గాలకు విషాన్ని తాగించాలని చూస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని ఆరోపించారు.. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు… ఆయన నికృష్ట రాజకీయాలకు సమాధానం చెప్పగలిగే ఏకైక నేత సీఎం జగనే అన్నారు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు..
Read Also: CM KCR : సీఎం కేసీఆర్‌కు ఎంపీ ఉత్తమ్ కుమార్ బహిరంగ లేఖ
అమరావతి అనేది కొందరికే పరిమితం చేయటం ఏంటి? అని ప్రశించారు సుధాకర్ బాబు.. అమరావతిలో పేదలు నివసించటానికి చంద్రబాబు ఎందుకు అంగీకరించరు? పేదలు అమరావతికి దూరంగా ఉండాలా? మా వారికి నివసించే అర్హత లేదా? చంద్రబాబుకు అణువణువునా అస్పృశ్యత ఉంది.. పేదలకు సెంటున్నర స్థలం ఇస్తే విషం చిమ్మటం ఎందుకు? అంటూ ఫైర్ అయ్యారు.. జగన్ పర్యటిస్తే పసుపు నీళ్లతో రోడ్డు కడిగంచిన వ్యక్తి చంద్రబాబు.. అలాంటి నీచ మనస్కుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వర్ల రామయ్యకు బుద్ది ఉంటే మంచి సమస్యల మీద ఫోన్ చేయాలి.. అంతేగానీ వికృత పనులకు చేసి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అభాసుపాలు చేయాలని చూడొద్దని.. నిజమైన అర్హులకు సమస్యలు ఉంటే ఫోన్ చేసి వారికి న్యాయం చేయాలని హితవుపలికారు.. ఇళ్లస్థలాలు ఇవ్వొద్దని కమ్యూనిస్టులు పోరాటం చేయటం సిగ్గుచేటన్న ఆయన.. ఇలాంటి రాజకీయాలు చేయటం ఈ రాష్ట్ర కమ్యూనిస్టులకే చెల్లింది.. ఎల్లోమీడియా, దత్తపుత్రుడు, చంద్రబాబు సంపాదించుకుంటేనే రాష్ట్రం బాగున్నట్టా? అని నిలదీశారు.