అతిచిన్న జీతం తీసుకునే వాలంటీర్ వ్యవస్థ పొట్టగొట్టాలని నాకులేదన్నారు పవన్ కల్యాణ్ .. ఐదువేల జీతం ఇచ్చి వారిని అక్కడే కట్టిపడేస్తున్నారు.. వారిలో ఎంతోమంది బలవంతులున్నారు.. వారిలో సైంటిస్టులు, వ్యాపారస్తులు ఇలా ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లున్నారన్నారు.. డిగ్రీ చదువుకుని ఐదువేలు ఇస్తూ ఊడిగంచేపిస్తున్నారు.. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చే డబ్బులు కూడా వారికి రావడంలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
చిరంజీవికి.. పవన్ కల్యాణ్కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.. నేను రాజకీయాలకు పనికి రాను.. తమ్ముడు పనికొస్తారని గతంలోనే చిరంజీవి అన్నారని గుర్తుచేశారు.. అంటే.. చంద్రబాబు చెప్పినట్టు తాను చేయలేనని.. పవన్ కల్యాణ్ చేయగలడనే విషయం తెలుసు కాబట్టే పవన్ రాజకీయాలకు పని కొస్తాడని చిరంజీవి అన్నారంటూ చెప్పుకొచ్చారు
జగన్పై ద్వేషం.. చంద్రబాబుపై ప్రేమ.. పవన్ మాటల్లో కన్పించిందని విమర్శించారు పేర్ని నాని.. 30 వేల మంది ఒంటరి మహిళలు అదృశ్యమయ్యారని.. ఈ లెక్కలు NCB.. పవన్ నుంచి వచ్చిందని చెప్పారు. NCRB లెక్కలైతే పవన్ కరెక్టుగానే చెప్పాడు.. కానీ, NCB లెక్కల కాబట్టే ఈ కామెంట్లు చేశాడని ఫైర్ అయ్యారు.