సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సామాజిక యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదు.. సామాజిక విప్లవానికి ప్రతీక ఈ యాత్ర అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన కులాలను అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి ఆలోచన ఈ యాత్ర.. వెనుక బడిన కులాలను తక్కువ చేసి మాట్లాడే చంద్రబాబు కాలంలో అనేక కులాలను వెలి వేసిన పరిస్థితి ఉండేది.. కానీ అలాంటి వెనుక బడిన కులాలను, వర్గాలను రాజ్యాధికారం వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడిపిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున చెప్పుకొచ్చారు.
Read Also: NZ vs PAK: న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అడ్డంకి.. రద్దైతే ఆ జట్టుకే గెలుపు అవకాశం..!
కులం, మతం కాదు.. అణగారిన వర్గాలను పైకి తీసుకురావడమే సామాజిక సాధికారత బస్సు యాత్ర చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అణగారిన వర్గాలకు రెండున్నర లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ అధినేత సీఎం జగన్.. అంబేడ్కర్ బావాజాలంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు దొరికిన దొంగ.. మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడు అని ఆయన మండిపడ్డారు. వెనుక బడిన వర్గాలు అప్రమత్తంగా ఉండాలి.. అందరూ కలిసి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అని మేరుగ నాగార్జున వెల్లడించారు. 2024లో మరోసారి సీఎం జగన్ ను ఆశీర్వాదించాలని ఆయన కోరారు. నిరంతరం ప్రజల కోసమే మన ముఖ్యమంత్రి పని చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున చెప్పుకొచ్చారు.