6 నెలలుగా నాకు సీటు రాకుండా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు మ్మెల్యే రక్షణ నిధి.. ఎంపీ కేశినేని నాని.. వైసీపీలోకి వచ్చే ముందే తిరువూరు సీటు కండీషన్ పెట్టారని.. అందుకే నన్ను తప్పించడానికి రకరకాల సర్వేలు చేయించి చివరికి సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తుతూ.. ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన.. మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసల వర్షం కురిపించారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందన్నారు యార్లగడ్డ..
వైసీపీ నాలుగవ జాబితాపై వైసీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాయలంతో సీఎం జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ జాబితాపై ప్రధానంగా చర్చించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీవీతో ఎంపీ మాట్లాడుతూ.. సీబీఎన్ పగటి కలలు కంటున్నారు.. తల కిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వరు అని ఆయన వ్యాఖ్యనించారు.
రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సమతా సభ ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. సాయంత్రంఆరు గంటలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుంది అని ఆయన చెప్పారు.