నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు.
నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కలిశారు.
న్నికలు ముందు చెప్పే మాటలు అధికారంలోకి రావడం కోసం కాదని, గెలిచాక ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. కనీస సౌకర్యాలకు నోచుకోని వారికి ఉపశమనం కలిగించే పనులు చేశారన్నారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు...పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్కు చెప్పారని తెలిసింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీకి రాజీనామా చేయాలని బెదిరించారని ఫిర్యాదు చేశారు కౌన్సిలర్ వెంకటలక్ష్మి.
మా అభ్యర్థిపై దాడి చేసి మా పైనే కేసులు పెడుతున్నారు అని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ పెమ్మసాని తెలిపారు.