మా అభ్యర్థిపై దాడి చేసి మా పైనే కేసులు పెడుతున్నారు అని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్ పెమ్మసాని తెలిపారు.
పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. దీంతో.. పిఠాపురంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. పవన్ విజయం పక్కానా? వంగ గీత అసెంబ్లీలో అడుగు పెడతారా?
ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్లో మెజార్టీ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినఘనత జగన్ దే అని తెలిపారు. జగన్ ను మరో రెండు సార్లు గెలిపించుకోవాల్సి ఉంది.. జగన్ ఓ సంఘ సంస్కర్త అంటూ ఎంపీ ఆర్. కృష్ణయ్య కొనియాడారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో జిల్లా నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరైయ్యారు.
వైసీపీ ఒకవైపు టీడీపీ- జనసేన- బీజేపీ మరోవైపు పోటీ పడుతున్నాయని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో రెడ్లకు కమ్మ - కాపుల మధ్య పోరాటం అనే చర్చ జరుగుతోంది.. మంచి పాలన అంటే కేవలం సంక్షేమం అని ఒక పార్టీ భావిస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు.. ఆ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందే అని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.