Kodali Nani: అమెరికా నుంచి కాదు కదా.. అంతరిక్షం నుండి వచ్చినా గుడివాడలో నన్ను ఓడించలేరని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుదరవల్లి, వీరివాడ, ఇలపర్రు, లక్ష్మీ నరసింహపురం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రజలు ఘన స్వాగతం పలికారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీకి ఒక ప్రయోగశాల అని ఆయన అన్నారు. ఎన్నికల వరకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఇంఛార్జిగా ఉంచుతారు…. నన్ను ఏసేస్తా… పొడిచేస్తా అంటూ ఆయన నియోజకవర్గమంతా తిరుగుతారన్నారు.
Read Also: AP Elections 2024: ఎన్నికల తనిఖీల్లో రూ. 119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్ స్వాధీనం
మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయనగా.. వాళ్ళ నాయకులే రావిని పక్కనపెట్టి విజయవాడ నుండో… అమెరికా నుంచో ఒకరిని తీసుకొచ్చి అభ్యర్థిగా నిలబెడతారన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఖర్చుపెట్టిన లిస్ట్ అంత కొత్తగా వచ్చిన అభ్యర్థికి రావి ఇస్తాడని ఆరోపించారు. ఈ ఉడత ఊపుడు బ్యాచ్ అంతా కలిసి.. నన్ను ఏసేస్తా.. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ తాటాకు చప్పుల్లు చేస్తారని విమర్శించారు. గుడివాడ నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని.. గుడివాడలో జరిగిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడదన్నారు. వాలంటీర్ వ్యవస్థ.. రైతు భరోసా.. నాడు-నేడు వంటి కార్యక్రమాలతో సీఎం జగన్ ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జగన్ చేసిన కార్యక్రమాల్లో ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. 130 సార్లు బటన్ నొక్కి 2, లక్షల 70 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి లంచాలు లేకుండా నేరుగా సీఎం జగన్ జమచేశారన్నారు. సచివాలయాల ఏర్పాటుతో రెండు లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి.. సీఎం జగన్ గ్రామ స్వరాజ్యాన్ని సాధించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. పెన్షన్లు సగానికి కోసేస్తాడని విమర్శలు గుప్పించారు.