ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో సీనియర్స్‌కి కొదవేం లేదు. అదే... ఎక్కడికక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసిందన్నది పార్టీ నేతల మాట. వీరిని కట్టడం చేసేందుకు గతంలో ఇన్ఛార్జ్‌లుగా ఉన్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నించేవారు. అభిప్రాయ తమ అనుభవాన్ని, పొలిటికల్ సీనియారిటీని ఉపయోగించి వేదికల మీద జరిగే గొడవల్ని నాలుగు గోడల మధ్యకు తీసుకురాగలిగేవారు.
ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేశారు కొందరు నాయకులు. రాజకీయ అలజడి నెలకొంటే వెంటనే సీన్‌లోకి వచ్చేవారు. మంత్రులంటే వీరే అన్నట్టుగా బిల్డప్ ఉండేది. తరచూ సీఎమ్ క్యాంపు కార్యాలయానికి రావటం.. మీడియా సర్కిళ్లలో హడావిడి చేయటం మామూలే. అంతెందుకు.. ముఖ్యమంత్రికి పలానా సలహా ఇచ్చిందే నేనే.. సీఎమ్ స్వయంగా నన్ను పిలిచి మూడు గంటలుపాటు నాతో కూర్చుని చర్చించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు అని చెప్పినవాళ్లూ ఉన్నారు. ఆ అంశంపై సీఎమ్‌కు…
ఆదిమూలపు సురేష్. ఏపీ మంత్రివర్గంలో రెండోసారి చోటు దక్కించుకున్న ఆయన ప్రస్తుతం మునిసిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే వైసీపీ కార్యకర్తలు మంత్రికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆయన తొలిసారి మంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుల్లలచెరువు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నెల్లూరు జిల్లా వైసీపీలో సెగలు రేపుతోందా? రివెంజ్ పాలిటిక్స్‌కు తెరలేస్తుందా? ప్లేస్‌లు మారతాయే తప్ప.. వర్గపోరు సేమ్ టు సేమ్ అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయా? ఇంతకీ అక్కడ వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలేంటి? ఎందుకు రుసరుసలు? పుల్ల విరుపు మాటల వెనక కథేంటి? సింహపురి వైసీపీ రాజకీయాల్లో రిటర్న్‌గిఫ్ట్‌లు ఉంటాయా? తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ.. ఆప్యాయత చూపించారో.. సహకారం అందించారో అంతకు రెట్టింపు సహాయ సహకారాలు ఉంటాయని… మంత్రి కాకాణి…
మంత్రి పదవులు దక్కలేదని అలకబూనిన నేతలంతా దారికొస్తున్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం.. అధినేతకు విధేయులుగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా అలక వీడారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథి, కాపు రాచమంద్రారెడ్డి అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బుజ్జగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అలకబూనిన ఒక్కో నేత… అధినేత దారిలోకి వస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పార్థసారథి,…
నచ్చిన నేతకు నీరాజనం పలికే జనాలు.. తేడా వస్తే అదేస్థాయిలో నిలదీస్తారు. ఆ ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో చర్చల్లోకి వచ్చారు ఆ అధికారపార్టీ శాసనసభ్యుడు. ఎవరా ఎమ్మెల్యే? ప్రజలు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న జనం?టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో రోజుకో రకంగా మారుతుంది. అలాంటి పరిస్థితినే చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారట. సొంత పార్టీలోనే దీనిపై జోరుగా…
కుప్పం పురపోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. కుపుం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో దొంగ ఓట్లు వేశారని వైసీపీపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి స్పందిస్తూ..కుప్పంలో దొంగ ఓట్లు అని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇంత వరకు…