తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయా..?కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటాయా..? వైఎస్ ఆశయాల కోసం కలిసి పనిచేస్తాయా..?రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుంటాయా..?టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమి వస్తుందా..? కొత్త కూటమి..! తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, షర్మిల పార్టీతో అవగాహన కుదుర్చుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తే.. టీఆర్ఎస్ కు గట్టి ఫైట్ ఇవ్వొచ్చనే ఆలోచన మొదలైంది. అవసరమైతే లెఫ్ట్…
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కోంటోంది. గత ఎన్నికల్లో 11 స్ధానాలను గెలుచుకోగా… రెబల్ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య పన్నెండుకు పెరిగింది. సంస్ధాగతంగా పార్టీ పటిష్టతకు, జిల్లా అభివృద్ధికి బాటలు వేసుకునే అవకాశం లభించింది. మంత్రివర్గ పునర్విభజన తర్వాత జిల్లాకు రెండు కీలకమైన పోర్ట్ ఫోలియోలు లభించాయి. గ్రామీణ అభివృద్ధి, ప్రజలతో నేరుగా సంబంధాలు వుండే మంత్రిత్వ శాఖలు కావడంతో నాయకత్వంలోనూ కొత్త ఆశలు చిగురించాయి. కానీ… క్షేత్ర స్ధాయిలో…
ఎంపీ రఘురామరాజుకు ఆనారోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవానికి మిశ్రమంగానే వుంది. బెయిల్ సమయంలో పత్రికకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు పెట్టడమే గాక సిఐడి పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాని కోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు గనక సిఐడి కస్టడీలో వుంచి విచారణ జరపాల్సినంత అవసరం లేదంటూ ఇప్పటికే వారు వీడియోతో సహా సాక్ష్యాధారాలు సేకరించుకున్న సంగతి గుర్తు చేసింది. స్వయానా సిఐడి…