మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, ఈనెల 21న, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం, ఆరోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది.
సాగునీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై కేంద్రపార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా.. ఇవాళ వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. ఇక, త్వరలో తమ రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటాం.. అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు
వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి మరో క్యాంపెయిన్ చేపట్టనుంది. నేటి(గురువారం) నుంచి వైసీపీ.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో సచివాలయ పరిధిలో ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.