వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డిలతో పాటు హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ అనే వ్యక్తులను విచారించారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో 8 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ 16 వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఇవాళ పులివెందుల, ఇతర ప్రాంతాల నుంచి కొందరు అనుమానితులు అధికారుల ముందు హాజరు కానున్నారు. కాగా నిన్న (సోమవారం) కూడా సీబీఐ అధికారులు కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో…
ముందు ప్రకటించినట్టుగానే అలిపిరిలో టీడీపీ నేత నారా లోకేష్ ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకు గానీ, తమ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి పాత్ర లేదని లోకేష్ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్‌రెడ్డి బయటికి రాలేదని అన్నారు. చెల్లికి న్యాయం చేయలేని వాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని లోకేష్ ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర ఉంది.. అందుకే రాలేదని అన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది…