Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హాట్ కామెంట్స్ చేశారు ఆయన కూతురు వైఎస్ సునీత.. గత రెండు రోజులుగా పులివెందులలో జరిగిన సంఘటనలు చూస్తుంటే నాన్న గారి హత్య గుర్తుకు వస్తుందన్న ఆమె.. గొడ్డలి పోటుతో వివేకా పడి ఉంటే.. గుండె పోటు అని చెప్పారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేసారు. హత్య తర్వాత లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టామన్నారు. నేను పెట్టలేదు.. అప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లో అదే జరుగుతుంది. అప్పుడు టీడీపీ నేతలు చంపారని నమ్మ బలికారు.. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి మా బంధువు.. అతనిపై ఎంపీ అవినాష్ అనుచరులు దాడి చేయించారాని అనుమానంగా ఉందన్నారు..
గత 6 ఏళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా.. ఇంత వరకు దోషులకు శిక్ష పడలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు సునీత.. వైఎస్ వివేకా హత్య.. సునీతా రాజశేఖర్ రెడ్డి చేయించారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసినవారికి శిక్ష పడాలి. నాన్న మళ్లీ తిరిగిరాడు. ప్రజలు అలోచించి నిజం బయటికి వచ్చేలా చూడాలి.. వివేకా హత్య కేసు నిందితులు బయట తిరుగుతున్నారు. రేపు వివేకా పుట్టినరోజు.. నా తల్లి నాకు పులివెందుల రావద్దని చెప్తుంది.. న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది.. నా మీద, నా భర్త మీద కేసులు పెడుతున్నారు… బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదని హెచ్చరించారు వైఎస్ సునీత..