మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మూడో రోజు పులివెందుల పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గత రెండు రోజుల పాటు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. నేటితో ఆయన తన పర్యటన ముగించుకోనున్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం వరకు పులివెందుల క్యాంపు అఫీసులోనే వైఎస్ జగన్ ఉండనున్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఆయన కలుస్తారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది.…
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రేపు(జూన్ 22న) పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్ జగన్.