వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు.
గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట... లేకపోతే కేసులు పెడతారంట ...హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు గవర్నర్తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Anagani Satya Prasad: గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పర్యటనలు చేశారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళినా.. గవర్నర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోరు.. వినుకొండ పర్యటన, గవర్నర్ ని కలవడం రాజకీయ లబ్ధి కోసమే చేశారు..
Home Minister Anitha: తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు ఆరోపణలు చేశారు.. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు.
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి తెర పైకి ప్రతిపక్ష నేత హోదా రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. 11 సీట్లే వచ్చాయి కాబట్టి.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటోన్న అధికార పక్షం.. ఇప్పటి వరకు జరగని అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరపని స్పీకర్..
ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.