ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి.
త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జగన్తో భేటీ అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని.. ఇంత మంచి చేసినా ఓటమి పాలవడం నమ్మశక్యంగా లేదన్నారు.
గృహనిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారథి కీలక కామెంట్లు చేశారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాను మార్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు.