మరో హస్తిన వెళ్లనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉంటారు. 5వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు.
తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్న ఆమె.. ఎన్టీఆర్ కుమార్తెగా నారా భువనేశ్వరి అంటే మాకు గౌరవం ఉంది.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నేతలు ఎవరూ చేయలేదన్నారు
వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్ అంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం వైఎస్ జగన్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూనియర్ న్యాయవాదులకు శుభవార్త చెప్పారు.. నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్ధిక సహాయం అందించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది..
Adipurush ticket price hike in Andhra Pradesh: ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 16న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఇంకా రోజుల వ్యవధి ఉన్నా సోషల్ మీడియాలో , మీడియాలో ఈ ఆదిపురుష్ మేనియా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ సినిమాను ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేయాలని అనుకున్నా ఎందుకో…
CM YS Jagan: విశాఖపట్నం పర్యటనకంటే ముందు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు. 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. మొత్తం 21 లేఔట్లలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తామని తెలిపారు.. గుంటూరు జిల్లాకు…