ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు బిజీగా గడపనున్నారు.. వరుస సమీక్షలతో పాటు.. ఈ రోజు సాయంత్రం తిరుపతి పర్యటనకు వెళ్లనున్నారు సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల జారీతో పాటు.. ధాన్యం సేకరణపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.
CM YS Jagan: ఆదాయార్జనశాఖలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కోవిడ్ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని.. లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయన్న ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. డిసెంబర్ 2022 వరకు జీఎస్టీ గ్రాస్ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం అయితే.. ఏపీలో వసూళ్లు 26.2 శాతంగా ఉన్నాయన్నారు.. ఇదే సమయంలో తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్(20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు సాధించామని వెల్లడించారు.. జీఎస్టీ వసూళ్లు 2022…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా.. పర్యాటక శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశానికి.. ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త కూడా చెప్పబోతున్నారు.. ఎందుకంటే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభంకానున్నాయి.. కరోనా మహమ్మారి…
విద్యావిధానంలో మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు.. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని అధికారులు తెలిపారు..…
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లోకి ప్రవేశించింది.. క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష చేపట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు లేకపోయినా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్…
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల దగ్గర సమగ్ర పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణ పరిస్థితులు సరిదిద్దాలన్నారు. రాష్ట్ర విభజన నుంచి వీటి గురించి పట్టించుకోలేదు.. దీని వల్ల ముప్పు పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా తగినంత మంది నిర్వహణా సిబ్బంది ఉన్నారా లేదా…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురిసిన వర్షాల ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు.. అప్పుడే మరో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది… ‘జవాద్’గా నామకరణం చేసిన ఈ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు ఏర్పాటు చేయాలని సూచించిన ఏపీ సీఎం..…
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్ధేశించిన కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాల యంలో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టులతో పాటు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైయస్సార్ స్టీల్‌ప్లాంట్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను సీఎం జగన్ సమీక్షించారు. విద్యాకానుకపై సమీక్ష2021–22 విద్యాకానుక కోసం రూ.790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విద్యా…
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం…
స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించి.. వాటికి కొన్ని సూచనలు చేశారు.. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు…