సోషల్ మీడియా పరిధి విస్తృతం కావడంతో పలు సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పుష్ప, రాధే శ్యామ్, సర్కారు వారి పాట సినిమాలకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు లీకుల బారిన పడ్డాయి. ఇప్పుడు రాజమౌళి సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’కు కూడా లీకుల బారిన పడిందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ఆ లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్…
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల కావాల్సిన ‘రౌద్రం రణం రుధిరం (RRR)’ టీజర్ గ్లింప్స్ వాయిదా పడింది. త్వరలో టీజర్ గ్లింప్స్ విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని RRR యూనిట్ తెలిపింది. ఈ టీజర్ గ్లింప్స్ నిడివి 40 సెకన్ల పాటు ఉంటుందని తెలుస్తోంది. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగా…
బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్‌బాస్ షోతో అలరించిన తారక్.. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నాడు. సీజన్ 1కు సంబంధించి నిర్వాహకులు మొత్తం 60 ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 37 ఎపిసోడ్లు టీవీలో టెలీకాస్ట్ అయ్యాయి. మరో 23 షోలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. సీజన్ 1 మొత్తానికి…
జాతీత అవార్డు పొందిన తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడట. తమిళంలో ‘పొల్లాదవన్, ఆడుకాలం, విచారణై, వాడా చెన్నై, అసురన్’ వంటి పలు హిట్స్ అందించిన వెట్రిమారన్ వద్ద ఓ ప్రత్యేకమైన కథ ఉందట. ఈ కథ కోసం తెలుగులో నటించే అగ్రహీరోల గురించి ఎదురు చూస్తున్నాడట. దీనిని ఇప్పటికే ఎన్టీఆర్ కి వినిపించాడట. జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందట.…
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల తర్వాత తన సెకండ్ టీవీ షోకు శ్రీకారం చుట్టాడు. 2017లో ‘బిగ్ బాస్’ సీజన్ వన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూ. ఎన్టీయార్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోలో ఇప్పటికే నటించిన ఎన్టీయార్, శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కు హాజరయ్యాడు. ఈ నెల 20 వరకూ దీని చిత్రీకరణ జరుగబోతోంది. జెమినీ టీవీ ఛానెల్…