ఓ యువకుడు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం చేస్తున్నాడు.. ఆ జాబ్‌ను వదిలేయడానికి తన నాలుగు వేళ్లను తానే కోసుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.
Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లోని బీచ్ రోడ్‌లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్‌గా పోలీసులు గుర్తించారు.
విహారయాత్రకు వచ్చిన ఓ మిత్ర బృందంలోని మిత్రుల మధ్య వేసుకున్న పందెంలో ఓ యువకుడు విగత జీవిగా అనుమానాస్పద రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) అనే యువకుడు, మరో 9 మందితో స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.. స్నే
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
Hyderabad Crime: టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మనకు తెలిసి వ్యక్తి.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా? అది అసలు ఖాతానేనా..? ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా? అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. చెల్లి పేరుతో ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ఓ అక్క.. ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అంతేకాదు.. అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆత్మహత్యాయత్నం…
పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రేమ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. క్రోసూరుకు చెందిన యువకుడు మస్తాన్ వలి సెల్‌టవర్ ఎక్కగా.. పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. క్రోసూరు గ్రామానికి చెందిన మస్తాన్ వలి అనే యువకుడు సిరిపురం గ్రామానికి చెందిన యువతిని పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి తీరా మోజు తీరిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఆ ఘనుడు ముఖం చాటేశాడు. గర్భవతి అని తెలిసి మందుల ద్వారా గర్భస్రావం చేయించాడు. విషయం కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో అసలు బాగోతం బయటపడింది. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో ఆ ఘనుడు పరారయ్యాడు. వి
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పరారయ్యాడు..
కుక్కులు మొరగడం .. అతడి వెంట పడడం.. దానికితోడు హిందీ మాట్లాడుతుండంతో.. యువకుడిని దొంగగా భావించి గ్రామస్థులు పట్టుకుని కట్టేసిన ఘటన సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో చోటు చేసుకుంది.. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టిన తరువాత అసలు విషయం వెలుగుచూసింది.