ఎంత చనువుగా మెదిలినా పులి పిల్లి అవ్వదుగా. చనువిచ్చింది కదా అని అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్ లో కొన్ని జూపార్క్ లలో పులులతో ఫొటోలు తీసుకుంటుంటారు. సరదాగా వాటి పక్కన నడుస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పైత్యం మరింత ముదిరింది. రీల్స్ కోసం ఏకగాం పెద్ద పులితోనే పరాచికాలు ఆడుతున్నారు. ఇలాగే ఓ యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది.…
ఈజీ మనీకోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్ లో వలపు వల విసిరారు. వాట్సాప్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. బాదితున్ని కరీంనగర్ రప్పించారు కేటుగాళ్ళు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు. తాము అమ్మాయి మనుషులం అంటూ సందీప్, ప్రణయ్, రెహన్ అనే ముగ్గురు…
వాటర్ క్యాన్ ఓ యువకుడి ప్రాణం తీసింది..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాటర్ క్యాన్ మూలంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బావిలో ఈత కొట్టేందుకు యువకుడు వాటర్ క్యాన్ డబ్బాను కట్టుకొని ఈతకు వెళ్లగా.. ఆ క్యాన్ కు హోల్ పడి నీళ్లు లోనికి వెళ్లి ఆ యువకుడు నీట మునిగి మరణించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది..
బెట్టింగ్ యాప్‌లు ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి సంపాదిస్తామన్న ఆశతో వాటి మోజులో పడి.. ఉన్న డబ్బునంతా పోగొట్టుకోవడమే కాదు.. అప్పులు చేసి మరి బెట్టింగ్‌లు పెట్టి.. చివరకు లక్షల్లో అప్పులు కావడం.. తీర్చే స్తోమత కూడా లేకుపోవడంతో.. ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతో మంది యువకులు.. తాజాగా, బెట్టింగ్ యాప్ లకు విశాఖపట్నంలో మరో యువకుడు బలి అయ్యాడు..
క్రికెట్ గ్రౌండ్లోనే గుండె ఆగి.. యువకులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.. అలాంటి ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగింది.. జిల్లాలోని వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురైన గౌస్ బాషా అనే యువకుడు కుప్పకూలిపోయాడు.. అయితే, వెంటనే ఆస్పమత్తమైన తోటి క్రికెటర్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు గౌస్ భాష..
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పరిధిలో గల గాంధీ నగర్ లో చోటు చేసుకుంది. వినయ్ అనే యువకుడు చందన అనే హిజ్రా వెంట పడి వేధిస్తున్నాడని ఆరోపణ వచ్చాయి.. ఆ హిజ్రాను పెళ్లి చేసుకుంటాను లేకపోతే రైలు కింద పడి చనిపోతానంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వినయ్.
నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన వేగంతో, అజాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…
సోషల్ మీడియా.. కలుపుతుంది.. విడగొడుతుంది .. మంచి చేస్తుంది ..చెడు చేస్తుంది.. ఈ సోషల్ మీడియానే ఇప్పుడు చాలామందికి శత్రువులుగా మారిపోయింది ..ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లు కూడా లేకపోలేదు.. సోషల్ మీడియా కాపురాలను కూల్చివేస్తుంది. పచ్చని సంసారంలో కూడా సోషల్ మీడియా చిచ్చు పెడుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక యాప్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తరహాలో ఇద్దరు కలిసి…
కొందరి స్త్రీ, పురుషుల ప్రవర్తన కుటుంబ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికాని యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకునే వారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్రెడీ పెళ్లైన వారు వారిని విడిచి పెట్టి కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్త, భార్యను వదిలేయడం, భార్య భర్తను వదిలి వెళ్లడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగ హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత…