వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఎర్ర గంగరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా వివేకానంద డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్ పై విచారణ చేసిన కడప కోర్టు.. బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను…
ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో విచారణ చాలా కాలం ముందుకు సాగడంలేదనే విమర్శలు వచ్చాయి.. అయితే, ఉన్నట్టుండి వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జరిగాయి.. ఆ కేసు పర్యవేక్షణ అధికారి సుధాసింగ్‌ను మార్చేసింది సీబీఐ.. ఈ మార్పు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వాచ్‌మాన్ రంగయ్యను జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు సీబీఐ అధికారులు.. ఇక, న్యాయమూర్తి సమక్షంలో రంగయ్య ఇచ్చిన వాగ్మూలంతో సంచలన విషయాలు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కాస్త ముందడుగు పడింది.. ఈ కేసులో వాచ్‌మన్ రంగయ్య తన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు.. అయితే, రంగయ్య వ్యాఖ్యలపై స్పందించారు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి.. అసలు వాచ్ మెన్ రంగయ్యతో నాకు పరిచయమే లేదన్న ఆయన.. నేను ఎవరిని బెదిరించలేదన్నారు… కడప, పులివెందులలో బెదిరించినట్లు నాపై కేసులు కూడా ఎక్కడా లేవు?…