కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి…
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది.…
ఢిల్లీః రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ను టీడీపీ అధినేత ఎన్. చంద్ర బాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతి కి అందజేశారు చంద్రబాబు. ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని… రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు.. అలాగే… .అక్టోబర్ 19 న జరిగిన ఘటనల పై…
భార్య రాజకీయంగా కీలక పదవిలో ఉంటే… భర్త పెత్తనం చేయడం చాలాచోట్ల చూస్తుంటాం. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఆ మున్సిపల్ కార్పొరేషన్లోనూ అదే జరుగుతోందట. ఆయన పర్మిషన్ ఇస్తేనే ఫైల్ కదులుతోందని పార్టీ కేడర్.. అధికారులు కోడై కూస్తున్నారు. దేవుడు వరమిచ్చినా.. ఆయన కరుణ లేకపోతే పనే కాదట. ఆ బాగోతం ఎక్కడో ఏంటో ఇప్పుడు చూద్దాం. షాడో మేయర్గా మారిన భర్త? షేక్ నూర్జహాన్. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. వరసగా రెండోసారి…
ఏపీలో రాజకీయాలు మరోసారి హిటెక్కాయి. టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్ తో గడిచిన రెండుమూడ్రోజులుగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లు వ్యహరిస్తుండటంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే టీడీపీ తన సమస్యను ఆంధ్రప్రదేశ్ సమస్యగా చూపిస్తూ పోరాటం చేస్తుండటంతో ఆపార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. ఇదే అదనుగా వైసీపీ సైతం టీడీపీపై ఎదురుదాడికి దిగుతోంది. దీంతో ఏపీలో పొలిటికల్ వార్ కు తెరలేచినట్లయింది. పట్టాభి…
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మరియు రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారు వైఎస్ షర్మిల. అయితే.. వైఎస్ షర్మిల చేస్తున్న ఈ పాదయాత్ర నేటికి ఐదోవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర లో ఓ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ పాలక మండలి చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైపీ సుబ్బారెడ్డి.. వైఎస్ షర్మిలను పాదాయాత్రలో…
అక్కడ అధికారపార్టీలో గ్రూపుల గోల ఎక్కువైంది. ఎవరిని కదిలించినా ఎదో ఒకవర్గం అనే మాట గట్టిగానే వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. పార్టీలోని నాయకులు వేస్తున్న ఎత్తుగడలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? చిత్తూరు వైసీపీలో మూడుముక్కలాట..! చిత్తూరు వైసీపీలో అంతా కలిసి ఉన్నట్టు కనిపిస్తారు కానీ.. ఎవరి కుంపటి వాళ్లదే. జిల్లాలో ఓ రేంజ్లో గ్రూపులు ఉన్న నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడ వైసీపీ నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఆయన…
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎవరికీ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. బద్వేల్…
ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నేతలు పరస్పరం ఒకరినొకరు వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు మరో యుద్ధాన్ని తలపిస్తున్నాయి. తాజాగా మంత్రి అనిల్కుమార్ ప్రతి పక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడన్నారు. చంద్రబాబు నాయుడు. ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ సీఎంను ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు ,కారం తిన్న వారు ఎవరు చూస్తూ…
అమరావతి : తెలుగు దేశం ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు టీడీపీ నేతలు. రాష్ట్రపతి తో పాటు ఇంకా ఎవరెవర్ని కలవాలనే దానిపై నేతలతో ఇవాళ చర్చించారు చంద్రబాబు. ఇక…