కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పారిశ్రామిక అభివృద్ధి పై కేంద్ర మంత్రి తో చర్చించామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. బ్యాక్ లాగ్స్ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని… దావోస్ ఈవెంట్ కు సిఎంకు ఆహ్వానం అందిందన్నారు.
ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకం కింద పలు పరిశ్రమలు ఇవ్వాలని కోరామని… పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం ఏ డి బి నుంచి 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని కోరామని తెలిపారు. దీని వల్ల రాష్ట్రం పై కొంత భారం తగ్గి అటువంటి అవకాశం ఉంటుందని.. మన్నవరం లో ఎన్టిపిసి లేదా బిహెచ్ఇయల్ ద్వారా ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వాలని కోరామని వెల్లడించారు. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని కొప్పర్తి లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరానని తెలిపారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి.