రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..వీటిపైనే చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. ముందుగా ఒక్క రోజే శాసన సభా సమావేశాలు నిర్వహించాలనుకున్నా… టీడీపీ డిమాండ్‌కు ఓకే చెప్పి ఈ నెల 26 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. మరోవైపు మొదటి రోజు సమావేశాల్లో కుప్పం రిజల్ట్ హాట్ టాపిక్ అయ్యింది.అసెంబ్లీలో తొలిరోజు మహిళా సాధికారత అంశంపై స్వల్ప కాలిక చర్చను చేపట్టారు. పలువురు మహిళా సభ్యులు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా కుప్పం కోర్ టాపిక్‌గా మారింది. చివరగా ముఖ్యమంత్రి జగన్.. మహిళా సాధికారత అంశంపై మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో మహిళల అభ్యున్నతికి ఏం చేయనందునే.. కుప్పం ఫలితం రూపంలో దేవుడు మొట్టికాయలు వేశారని ఎద్దేవా చేశారు. సమావేశాలు పొడిగించాలని బీఏసీలో డిమాండ్ చేసిన టీడీపీ.. సభలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినా.. సభలోకి రాకుండా తన ఛాంబర్‌కే పరిమితం అయ్యారు. అయితే కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు అసెంబ్లీకి రాలేదేమో అని సెటైర్లు వేశారు సీఎం జగన్. ఇప్పటికైనా చంద్రబాబు తప్పులను తెలుసుకోవాలని సూచించారు.
ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తి అవుతాయి. రాజ్యాంగ అనివార్యత కారణంగా నిన్న ఒకరోజు సమావేశం నిర్వహించి… శాసనమండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత డిసెంబర్ నెల మూడో వారంలో 5, 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం… టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చింది. బీఏసీలో సమావేశాలు పొడిగించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్నారు. దీంతో సీఎం జగన్ కూడా అనూహ్యంగా సమావేశాల కొనసాగింపునకు అంగీకరించడం హాట్ టాపిగ్గా మారింది. ఇప్పుడు టీడీపీనే పారిపోకుండా సభకు రావాలని చురకలు అంటించారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Tags
- AP assembly meetings
- tdp
- ycp
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!