ఎమ్మెల్సీలుగా 11మంది వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు… ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు… విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే… తూర్పుగోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు)…. కృష్ణా జిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోకసభ పక్ష నాయకుడు మిధున్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం అందించాల్సిన తోడ్పాటు పై ఈ సందర్భంగా అమిత్ షా కు వివరించారు విజయసాయి రెడ్డి.ఆయా అంశాలపై విపులంగా అమిత్ షా కు మెమోరాండాన్ని అందజేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా విన్నవించారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి…
సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ జిల్లాల్లో కోడి పందాలకు బరులను సిద్ధం చేస్తారు..! ఆ ఎమ్మెల్యే మాత్రం పెద్దపండగను దృష్టిలో పెట్టుకుని రోడ్లు మరమ్మత్తులు చేపట్టారు. అదీ సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారట. దెబ్బతిన్న రోడ్లపై ఎమ్మెల్యేకు ఒక్కసారిగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? వాటిని బాగు చేయాలనే ఆలోచన వెనక కథేంటి? ఎవరా ఎమ్మెల్యే లెట్స్ వాచ్..! ఈసారి సంక్రాంతికి భారీగానే సొంతూళ్లకు వస్తారని అంచనా..!దెబ్బతిన్న రోడ్లపై ‘రూటు’మార్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి..! సంక్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాల్లో…
ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం నిర్భంద వసూళ్లకు పాల్పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ …వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారులకు టార్గెట్ ఇచ్చి అక్రమంగా ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముఖంగా నిరూపించడానికి బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మంత్రి బొత్స అబద్ధాలడుతున్నారని, ముఖ్యమంత్రికి జగన్నే సవాల్ చేస్తున్నాని ఆయన అన్నారు. నిరూపించపోతే మేము రాజీనామా చేస్తాం.. నిరూపిస్తే…
క్షేత్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి దీనిపై స్పష్టంగా వివరిస్తున్నారు. గతంలో హౌసింగ్ బోర్డుల కింద అప్పులు తీసుకుని … ఆ అప్పులు కట్టకపోవడం వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిందే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం. ఈ పథకం కింద డీ ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లకు కూడా…
వైసీపీ సర్కార్ పై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని పేర్కొన్నారు. ఇళ్లకు సీఎం భూమి ఇచ్చారా? రుణం ఇచ్చారా?.. ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటి? అని చంద్రబాబు నిలదీశారు. కంపల్సరీ కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని… బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు చేస్తోంటే కేసులు పెడతారా..? అని నిలదీశారు. ఛీటింగ్ కేసులు..…
అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసిపి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే వైసిపి పార్టీ ల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తప్పు ఉంటే భువనేశ్వరి కాళ్లు కన్నీళ్లతో కడతామని… పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మహిళలు…
తిరుపతి : కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని కలిసి…వారి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. పునీత్ అకాల మరణం చాలా బాధించిందని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ అని కొనియాడారు…
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్లో పవళిస్తున్న జగన్ ఇంకా నిద్రలేవలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ .. ఏపీ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురింపించారు.వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39…