చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారు అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్రజలు వీళ్ళను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. జగన్ ఓటు పులివెందులలో ఉంది. ఇక బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది అని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు ఉత్తరాంధ్ర, సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు.…
వైసీపీ దిగజారిపోయింది అనడానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి అరకులో గంజాయి ఉందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. పోలీస్ అధికారిని ఉద్దేశించి అలా మాట్లాడే బదులు, తాము గంజాయి అమ్ముతున్నామని విజయ సాయి చెప్పాల్సింది. ఆ పోలీస్ అధికారి టీడీపీ మనిషన్నట్లుగా కూడా విజయసాయి మాట్లాడారు. కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, తనరాష్ట్ర పోలీస్ అధికారులతో చెప్పారు. అంతమాత్రాన కేసీఆర్…
వైఎస్సార్ వర్ధంతి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల కు కర్తవ్య బోధ చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు… ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అవినీతి రహిత పాలన, సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. పదవుల విషయంలో అందరికి అవకాశాలు కల్పిస్తాం. ఇక్కడ కొన్ని ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. భూములు, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. నాకు డబ్బు మీద ఆసక్తి లేదు.…
ఆఫ్ఘనిస్తాన్ పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావాలని కోరాం. ఆఫ్ఘనిస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైంది. తాలిబన్లతో చర్చలు జరిపి అందరిని క్షేమంగా తీసుకురావాలి అని పేర్కొన్నట్లు తెలిపారు. మన దేశం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి. భారతీయులను, పెట్టుబడులను కూడా పరిరక్షించాలి.…
డెడ్ బాడీ కనిపిస్తే లోకేష్ రాబందులాగా వాలిపోతాడు. బూతులు తిడుతుంటే హీరో అయిపోతాను అనుకుంటున్నాడు అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. పిచ్చి వర్కవుట్ లు చేసి బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా తగ్గింది అని పేర్కొన్నారు. లోకేష్ కు తన తండ్రి హయాంలో దళితుల పై జరిగిన దాడుల సంగతి తెలుసా… కారంచేడు సంఘటన ఎవరి హయాంలో జరిగిందో లోకేష్ తెలుసుకోవాలి అని సూచించారు. నేరస్తుడు ఎలాంటి వ్యక్తి అయినా…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాము పాటు పోరాటం చేసి సాధించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో కలసి పోరాటం చేస్తాం అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కోవిడ్ లో వేలాది మంది ప్రాణాలు కాపాడింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది. ఇప్పుడు దానిని అమ్మితే బావి తరాలు ఏం చేయాలి… అని కేంద్రం ఆలోచన చేయాలి అని తెలిపారు. వైజాగ్ స్టీల్ అప్పును…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కేఆర్ఎంబి బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశాను అన్నారు. కేఆర్ఎంబి పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరాను. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చును సగభాగం “జలజీవన్ పథకం”…
పొలిటికల్ ఎంట్రీలోనే ఆయన ఎంపీ అయ్యారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి. గెలిచి రెండేళ్లయింది. అంతలోనే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ గ్యాప్ వచ్చినట్టు టాక్. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏమా కథ? 2019లో ఎంపీగా గెలిచి రాజకీయ తెరపైకి వచ్చారు డాక్టర్ సంజీవ్ కుమార్. కర్నూలు జిల్లాలో ప్రముఖ వైద్యులు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీచేసి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఎంట్రీలోనే బంపర్ ఛాన్స్ కొట్టారని…
మాన్సస్ ట్రస్ట్ లో వందల ఎకరాలు కాజేసిన చేసిన దొంగ అశోక్ గజపతిరాజు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అశోక్ గజపతిరాజు గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉంది. కాబట్టి ఆయన జైలుకి వెళ్లడం తప్పదు. మాన్సస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తాము. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజుల ఫీలవుతున్నారు.. సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపించ వద్దని గతంలో తీర్పు నిచ్చింది. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రవేశం పై లింగ వివక్ష పాటించ వద్దని…