సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
YSRCP Leader Attacked Anchor Kavyasri at Rajamundry: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్ పై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన కావ్య శ్రీ అనే ఈవెంట్స్ చేసే యాంకర్ సహా ఆమె తండ్రిని వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్ వి శ్రీనివాస్ విచక్షణ రహితంగా కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శ్రీనివాస్ మీద కేసు నమోదు…
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. అధికారపార్టీలో ఆధిపత్యపోరు చర్చకు వచ్చింది. నిందితులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి తానేటి వనిత ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరుకు మంత్రి స్టేట్‌మెంట్‌కు పొంతన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్ట్ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ ముందుకెళ్లడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. దానికితోడు నిందితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు నాయకులు. రిమాండ్‌లో ఉన్న…
నగరి ఎమ్మెల్యే రోజా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రత్యర్థి వర్గం నేత, శ్రీశైలం ట్రస్టు బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి. ఆయన మాట్లాడుతూ.. రోజాను రెండుసార్లు కష్టపడి మేము గెలిపించాము. అందుకు ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అన్నారు. రోజాకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను. నాపై ఆమె గెలవగలదా అని ప్రశ్నించారు. ఫైర్ బ్రాండ్ అంటూ చెప్పుకోవడం కాదు. మండలంలో రోజా బలపరిచిన ఒక్క ఎంపీటీసీ మాత్రమే గెలిచారు. మేము…
నగర స్థాయి నేతగా ఉన్న ఆయన… నామినేటెడ్ పదవి రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. ఆయన రాజకీయ అరంగ్రేటం ఒకవర్గం నుంచి జరగ్గా.. ప్రస్తుతం ఆయన కలిసి పనిచేయాల్సిన నేత ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు. అదే ఆయనకు తలనొప్పిగా మారిందట. ఆ నేత కలిసి పనిచేస్తున్పప్పటికీ ఆయన సామాజికవర్గంలోని కొందరు మాత్రం లోలోపల గొణుక్కుంటున్నారట. మరికొందరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారట. దీంతో కొత్త పదవి కత్తి మీద సాములా మారిందట. ఆయనెవరో…
జిల్లా కేంద్రం వస్తుందన్న ప్రచారంతో అక్కడ రియల్ బూమ్ అందుకుంది. అదికాస్తా అధికారపార్టీ నేతకు వరంగా మారింది. ఆ ప్రాంతంలో ఏం చెయ్యాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. ఎవరు వెంచర్ వేసినా కమీషన్ ఇవ్వాల్సిందే. కప్పం కట్టందే పని జరగదు. ఇదే ఆ జిల్లాలోని అధికారపార్టీలో చర్చగా మారింది. నరసరావుపేట చుట్టూ 10 కి.మీ. పరిధిలో వెంచర్లు! నరసరావుపేట జిల్లా కేంద్రం అవుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో ఇక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రియల్ బూమ్…