Nellore: అక్రమ మైనింగ్ పైన వై.సి.పి.నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమ మైనింగ్ పై పూర్తి సమాచారం తో వస్తే నేనే దానిని అడ్డుకుంటా అని అయన అన్నారు. కాగా నా మిత్రుడు అనిల్ మైనింగ్ పై మాట్లాడారు. అయితే నేను మాత్రం ఇతర నియోజక వర్గాలలో వేలు పెట్టను అని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలానే ప్రస్తుతం రూ.800 కోట్ల నిధులతో వెంకటగిరి నియోజక వర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపిన ఆయన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మా దృష్టికి వచ్చిన సమస్యల్లో 60 శాతం పైగా తీర్చామని.. మిగతా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. అలానే వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరగానే అయన పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని పేర్కొన్నారు.
Read also:Nagarjuna Sagar: సాగర్ నుంచి నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు
నా ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరను 5 రోజుల పాటు ఘనం గా నిర్వహించామని తెలిపిన ఆయన.. జాతరకు వచ్చిన 4 లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నాం అని తెలిపారు. అలానే రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో క్రీడల పండుగ మొదలు కాబోతోంది అని తెలిపిన ఆయన.. క్రీడల్లో వెంకటగిరి నియోజక వర్గం లోని క్రీడాకారులు మొదటి వరుసలో వుంటారని వెంకటగిరి నియోజక వర్గం లోని క్రీడాకారులను కొనియాడారు. అలానే త్వరలోనే 18 వందల టిడ్కో ఇళ్లను లబ్ది దారులకు అందిస్తామని చెప్పారు. అదేవివిధంగా టిడ్కో కాలనీ సమీపం లో అందమైన పార్కు ను నిర్మిస్తాం అని పేర్కొన్నారు.