YSRCP Leader Attacked Anchor Kavyasri at Rajamundry: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్ పై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన కావ్య శ్రీ అనే ఈవెంట్స్ చేసే యాంకర్ సహా ఆమె తండ్రిని వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్ వి శ్రీనివాస్ విచక్షణ రహితంగా కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారు. మీడియా ముందుకు వచ్చిన యాంకర్ కావ్య శ్రీ వైసిపి నాయకుడు ఎన్వీ శ్రీనివాస్ కుమారుడికి 2021లో మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించింది. ఆ తర్వాత అనేకసార్లు ఇంటి చుట్టూ తిరిగినా బాకి చెల్లించడం లేదని తెలిపింది. మాజీ ఎంపీ భరత్ అనుచరుడు కావడంతో ఆయన వద్దకు వెళ్లినా న్యాయం జరగలేదని ప్రస్తుతం తనపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ మార్గాని భరత్ జోక్యం చేసుకోవద్దని కావ్య శ్రీ కోరుతోంది. తనపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని యాంకర్ కావ్య శ్రీ డిమాండ్ చేస్తుంది.
Shraddha Kapoor: రిలేషన్‌లో ప్రభాస్ హీరోయిన్..ఎట్టకేలకు ఒప్పేసుకుంది!
ఈ విషయం మీద అధికార టీడీపీ ట్విట్టర్ లో స్పందించింది. ‘’దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన జగన్ రెడ్డి సైకో ముఠా, అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజల భూములు, ఇళ్ల స్థలాలను ఆక్రమించి అనేక ఇబ్బందులకు గురి చేసిన సైకో జగన్ గ్యాంగ్, తాజాగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగితే వారిపైనే దాడి చేశారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన తండ్రి, కుమార్తెపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. మేము జగన్ రెడ్డి మనుషులం, మమ్మల్నే డబ్బులు అడుగుతారా అంటూ, మహిళ అని కూడా చూడకుండా పిడి గుద్దులు గుద్ది గాయపరిచాడు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.’’ అంటూ పేర్కొన్నారు.