బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఈ నెల 7వ తేదీన బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో బీసీ మంత్రులు, అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈనెల 7న జరిగే బీసీ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించనున్న అంశాలను వివరించారు ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్. మూడు ప్రధాన అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని…