గన్నవరం టీడీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ సీనియర్ నేత, గన్నవరం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు పొట్లూరి బసవరావు జన్మదిన వేడుకలు వేదికగా విభేదాలు బయటపడ్డాయి. బసవరావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఫోటోను ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే గన్నవరంలో టీడీపీ సీనియర్ లీడర్లను పక్కన పెట్టారని, వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెత్తనం చేసిన వారే ఇప్పుడు యార్లగడ్డ దగ్గర పెత్తనం చేస్తున్నారని బసవరావు…
ఆ టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నారా? గెలిచి 9నెలలవుతున్నా…. ఏం చేయలేకపోతున్నానని ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారా? చివరికి తప్పు చేసిన వారిని శిక్షించలేకపోయానన్న బాధ ఆయనలో పెరిగిపోతోందా? అసలాయన ఏమన్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? ఎవరా శాసనసభ్యుడు? గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…2019లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి అప్పటి తన ప్రత్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీని వీడి టీడీపీ బీఫాం మీద పోటీ…
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో స్ధానిక నాయకులతో కలిసి గన్నవరం నియోజకవర్గం జనసేన, బీజేపీ బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ..…
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రచారం మరింత విస్తృతం చేసిన యార్లగడ్డ.. విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, గ్రామ సర్పంచ్ సర్నాల బాలాజీ ఆధ్వర్యంలో ప్రచారం హుషారుగా సాగింది.. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. 175 కి 175 అన్న వైఎస్ జగన్…
రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడాలంటే అది టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు . విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు.
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వ నాయకులు తెలుగు భాషను కు.ని చేసి బూతులు మాట్లాడం బాధాకరం అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పనా కల్పించక పోగా యువతను తప్పు దారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని…
విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టనున్న అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం సోమవారం ప్రారంభమైంది. గన్నవరం ప్రజలు సుఖ:సంతోషాలతో వర్ధిల్లటంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. ఈ యాగం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమం 26, 27, 28 తేదీల్లో జరుగనుంది.…
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా విక్రయించిన రైతులకు.. నెలలు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. రైతులకు పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బును వెంటనే విడుదల చేయటంతో పాటు తుఫాన్ బాధితులకు పంట నష్ట పరిహారం అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.