Yarlagadda Venkata Rao: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. నియోజకవర్గంలోని చాగంటిపాడులో యార్లగడ్డ పర్యటించారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఉంగుటూరు మండలంలోని చాగంటిపాడు, నందమూరూ గ్రామాలలో పర్యటించి.. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలతో పాటు పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో ప్రజలకు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Chandrababu: చంద్రబాబుతో ఆలపాటి రాజా భేటీ.. రాజకీయ భవిష్యత్‌కు హామీ!
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా విక్రయించిన రైతులకు.. నెలలు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. రైతులకు పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బును వెంటనే విడుదల చేయటంతో పాటు తుఫాన్ బాధితులకు పంట నష్ట పరిహారం అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో ఆదివారం రైతులు చేపట్టిన నిరసన దీక్షలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన దీక్షా శిబిరానికి ర్యాలీగా వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల ముఖాల్లో సంతోషం చూడాలన్నా.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా అది టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా.. యార్లగడ్డ వెంకట్రావు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.