Yandamuri: యండమూరి వీరేంద్రనాధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచనలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈయన రాసిన రచనల వలనే ఎంతోమంది హీరోలు స్టార్లగా మారారు. అందులో చిరంజీవి ఒకరు. చిరు హిట్లు అందుకున్న ఎన్నో సినిమాలు యండమూరి రచనలను ఆధారంగా చేసుకొని తీసినవే. ఇక మెగాస్టార్ అనే బిరుదును కూడా చిరంజీవికి అందించింది యండమూరినే.