దశాబ్దాల తరబడి నెత్తిన పెట్టుకుని మోసినా, ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినా… ఆ టీడీపీ సీనియర్ నేత సంతృప్తిగా లేరు ఎందుకు? జీవిత కాలం పదవులు అనుభవించినా… ఆయనకు ఆ ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయే ఉందా? అది తీరితే తప్ప ఆయనకు మనశ్శాంతి ఉండదా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటాయన కోరిక? దాన్ని తీర్చాలన్న ఉద్దేశ్యం అస్సలు టీడీపీ అధిష్టానానికి ఉందా?. టీడీపీ ఆవిర్భావం నుంచి మెడలో పసుపు కండువా తప్ప మరోటి తెలియని…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రూ.3,700 కోట్లు లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా ఆయన ఇంట్లోకి వెళ్లిందన్నారు. 2029 ఎన్నికల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని యనమల చెప్పారు. ప్రత్తిపాడు…
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలౌతుంటే ఆధారాలు లేని స్కాముల పేరుతో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. అర్థాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్దాలు పెట్టి చంద్రబాబు నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు.
టీడీపీకి గట్టిపట్టున్న ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెలుసు బారిపోయింది. కీలక నేతలే కవ్వించుకుంటున్నారు. అధికారపక్షానికి అవకాశం ఇవ్వకుండానే తన్నుకు చస్తున్నారు నేతలు. అలాంటి జిల్లాలో టీడీపీ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు త్రిసభ్య మంత్రం వేసింది అధిష్ఠానం. ఈ ప్రయత్నం వర్కవుట్ అయ్యేనా? ఇంతకీ ఏంటా జిల్లా? ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి బలమైన ప్రాంతం. అలాంటి చోట పార్టీకి నాయకులే సమస్యలు తీసుకొస్తున్నారని మూడేళ్లుగా కేడర్ గగ్గోలు పెడుతోంది. 2014లో టీడీపీ 12…