Bee Attack : పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.