సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'మేమ్ ఫేమస్'. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమా ఓ వారం ముందే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశాడు.
Writer Padmabhushan: కథ బావుంటే.. బడ్జెట్ తో కానీ, హీరోతో కానీ ప్రేక్షకులకు సంబంధం ఉండదు. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలే వస్తున్నాయి అని చెప్పాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కలర్ ఫోటో లాంటి చిన్న సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్.
ఫిబ్రవరి మాసంలో అనువాద చిత్రాలతో కలిపి 22 సినిమాలు విడుదల కాగా అందులో విజయం సాధించినవి కేవలం మూడు చిత్రాలే! ద్విభాషా చిత్రం 'సార్' ఫిబ్రవరిలో అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
సుహాస్ హీరోగా అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. విజయవంతంగా ప్రదర్శితమౌతున్న ఈ చిత్రం చూసిన నాని యూనిట్ సభ్యులను అభినందించారు.
'రైటర్ పద్మభూషణ్' చిత్ర బృందాన్ని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అభినందించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Writer Padmabhushan: చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ఎవరి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరం చెప్పలేం. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్లు అయిన వారు ఉన్నారు.. ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి విజయాలను అందుకొని అందరి దృష్టిలో పడినవారు ఉన్నారు.
'రైటర్ పద్మభూషణ్' చిత్రం బృందం బుధవారం మహిళల కోసం ఉచితంగా తమ చిత్రాన్ని ప్రదర్శించబోతోంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో 38 థియేటర్లను ఎంపిక చేసింది.
ప్రిన్స్ మహేశ్ బాబు 'రైటర్ పద్మభూషణ్' చిత్రాన్ని చూశారు. అనంతరం తన ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని మహేశ్ కితాబిచ్చారు.
'ది బేకర్ అండ్ ది బ్యూటీ' వెబ్ సీరిస్ లో నటించిన టీనా శిల్పరాజ్ ఇప్పుడు 'రైటర్ పద్మభూషణ్' మూవీతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ మూవీ ప్రేక్షకులకు ఓ ఎమోషనల్ రైడ్ లా అనిపిస్తుందని టీనా చెబుతోంది.