Brij Bhushan: రెజ్లర్ వినేష్ ఫొగట్ పై మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేష్ ఫొగట్ ఒలంపిక్స్‌లో మోసం చేసి ఫైనల్ వరకు వెళ్లిందని ఆయన ఆరోపించారు. అందుకే ఆమెకు పథకం రాకుండా దేవుడు శిక్షించాడని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు ఒలింపియన్ వినేష్ ఫోగట్ మంగళవారం(డిసెంబర్ 26) రోజున తెలిపారు. మల్లయోధులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేసినప్పటికీ మహిళా రెజ్లర్‌లకు జరిగిన న్యాయంపై వినేష్ ఫోగట్ నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖలో వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.
Wrestler Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెజ్లర్ల నిరసనకు అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడం చాలా కష్టమని…