‘పొరుగుంటి పుల్లకూర రుచి’ అన్నట్లుగా మనం మన విషయాల కంటే పక్కింటి సంగతులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాం. పక్కోడి విషయాలు తెలుసుకోవడంలో ఉన్న కిక్కే వేరప్పా అన్నట్లు కొందరు అదే పనిలో ఉంటారు. మరికొందరైతే చిన్న విషయాన్ని కూడా ఏదో అద్భుతంగా చిత్రీకరిస్తుంటారు. ఇంకొందరైతే చాలా స్పెషల్ గా ఉంటారు. అసలు ఏం లేకపోయినా ఏదో ఒక పుకారు సృష్టించి ట్రెండింగ్ లోకి తీసుకొస్తూ ఉంటారు.అందుకే మన దేశంలో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసే రియాలిటీ షో…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. ఇదివరకు నెంబర్. 1 గా వున్న ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగమించింది. ఒక్కసారిగా టిక్‌టాక్ గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. అయితే.. ఇండియాలో గత సంవత్సరం జూన్…