సీఎం జగన్ దావోస్ పర్యటనలో రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో జగన్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని జగన్ రిక్వెస్ట్ చేయగా.. గుర్నాని సానుకూలంగా స్పందించారు. టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l — YSR Congress Party (@YSRCParty) May 23, 2022…
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. తొలిరోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో జగన్ సమావేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. తొలుత ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను జగన్ పరిశీలించారు. అనంతరం డబ్ల్యూఈఎఫ్ హెల్త్ విభాగం అధిపతి శ్యాం…
ఏపీ సీఎం జగన్ శనివారం రాత్రి దావోస్ చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. రేపు డబ్ల్యూఈఎఫ్‌తో జగన్ కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ సదస్సు తొలిరోజు పలువురితో జగన్ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో ఏపీ రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనుంది. నూతన…