స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన పారిశ్రామిక వేత్తలతో బిజీగా గడిపారు.
Today (18-01-23) Business Headlines: హైదరాబాదులో పెప్సికో విస్తరణ: అమెరికన్ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ పెప్సికో హైదరాబాదులో కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడాదిన్నర లోపు 12 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 2019లో 250 మందితో ప్రారంభమైన పెప్సికో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఇప్పుడు 2 వేల 800 మందితో నడుస్తోంది. విస్తరణతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు చేరనుంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణ రాష్ట్రానికి తొలిరోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు అడ్డాగా ఉన్న భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ సంస్థ కొలువుదీరనుంది.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా సోమవారం ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరుకానున్నారు.
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు పర్యటన విజయవంతంగా ముగిసింది. మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా సుమారు 4200 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు తో పాటు పెట్టుబడి ప్రకటనలను ప్రకటించాయి. ఈ సారి భారతదేశం నుంచి దావోస్ లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్ లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.…
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్‌తో పాటు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. అమరరాజా బ్యాటరీస్ అధినేత హోదాలో దావోస్ సదస్సుకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఇప్పటికే కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో కలిసి ఓ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ తాజాగా మరో సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాల్గొనడం విశేషం. ఈ మేరకు ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో…
ఏపీ సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ వేదికగా జగన్ రెడ్డి చెబుతున్నవన్నీ నిజాలేనా..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంబులెన్సులు ఉండవు… సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు కుట్లు వేసి కట్లు కడతారని చెప్పాల్సింది. కోవిడ్ కాలంలో కేంద్రం ఇచ్చిన నిధులు ఎటుపోయాయి? వైసీపీ ఆర్థిక అరాచకం వల్లే విదేశీ పెట్టుబడులు రావడం లేదన్నారు పవన్. ఏపీలో వైద్యారోగ్య రంగం వెలిగిపోతోందంటూ దావోస్ వేదికగా జగన్ చెప్పిన మాటలను ప్రజలు…
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో కీలక పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ మేరకు జగన్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎంవోయూలను కుదుర్చుకుంటున్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు రూ.60 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. Jagan Davos Tour: టెక్ మహింద్రాతో ఏపీ ప్రభుత్వం…
దావోస్ వేదికగా వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సదస్సుకు ఏపీ సీఎం జగన్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కూడా ఈ సదస్సుకు హాజరైనట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ దావోస్‌లోని ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరైనట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో కలిసి…