Kane Williamson becomes leading run-getter of New Zealand in 48 year old World Cup history: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే కాకూండా.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని కేన్ చేరుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 24 ఇన్నింగ్స్‌లో కేన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన కేన్.. ఈ రికార్డును అందుకున్నాడు. బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ 95 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న జాబితాలో కేన్ విలియమ్సన్ ఆరో స్థానంలో నిలిచాడు. డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మలు 19 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌లో.. వివ్ రిచర్డ్స్, సౌరవ్ గంగూలీ 21 ఇన్నింగ్స్‌లో.. మార్క్ వా, హెర్షల్ గిబ్స్ 22 ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ తరఫున ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదు.
Also Read: Realme GT5 Pro Price: రియల్‌మీ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
బొటనవేలి గాయం కారణంగా కేన్ విలియమ్సన్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. గత నాలుగు మ్యాచ్‌లకు దూరమైన కేన్.. పాకిస్తాన్‌పై కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. కివీస్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాదించాల్సిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న కివీస్ 43 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ (37), గ్లెన్ ఫిలిప్స్ (12) క్రీజులో ఉన్నారు. రచిన్ రవీంద్ర (108) రన్స్ చేశాడు.
1000 runs for Kane Williamson in World Cups.
– He is the 3rd Kiwi player to achieve this, one of the greatest in modern Era. pic.twitter.com/ONQwzZgSvQ
— Johns. (@CricCrazyJohns) November 4, 2023