World Cup 2023: దాదాపుగా 20 ఏళ్ల తరువాత భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో తలపడబోతున్నాయి. చివరి సారిగా 2003లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్స్‌లో ఆడాయి. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ నేతృత్వంలో ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడాయి. అయితే ఈ మ్యాచ్ మాత్రం కోట్లాది మంది భారత అభిమానులకు చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత విజయాన్ని అడ్డుకున్నాడు