మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దాంతో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్ సేన తెరదించింది. మిథాలీ రాజ్ నాయకత్వంలో రెండుసార్లు భారత్ ఫైనల్‌కు వెళ్లినా.. నిరాశ తప్పలేదు. ఈసారి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫాన్స్ అయితే టపాసులు కాలుస్తూ తెగ ఎంజాయ్ చేశారు.…