తెలుగు అనే కాదు అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు “నిర్మాత” అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే ‘క్యాషియర్’ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతీ మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ‘స్వప్న సినిమా’ బ్యానర్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ‘ఛాంపియన్’ చిత్రంతో మరో…