Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పోలీసుల సిగ్గుమాలిన చర్య చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ మహిళను కొట్టి గాయపరిచారు. దీనిపై మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు మహిళను ఒక గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా ఆమె బట్టలు తొలగించి, గాయం గుర్తుల ఫోటోలు తీశారు.