ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భయంతో ప్రజలు రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. తోడేళ్లు ఎప్పుడు, ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. ఈ నరమాంస భక్షకుల దాడిలో ఇప్పటివరకు 9 మంది చిన్నారులు సహా 10 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు.
Wolf Attacks: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలను కిల్లర్ తోడేళ్లు వణికిస్తున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు ఊళ్లపైపడి దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తునున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో తోడేళ్ల గుంపు ఇళ్లలోకి చొరబడి పిల్లల్ని ఈడ్చుకెళ్లి చంపి తింటున్నాయి.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆదివారం ఇక్కడ ఓ అమాయక బాలిక, వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది.
యూపీలోని బహ్రైజ్ జిల్లాలో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి తోడేలు మళ్లీ దాడి చేసింది. పూరి బస్తీ గడారియాకు చెందిన మజ్రా జంగిల్ పూర్వా నివాసి పరాస్ (07) ఇంట్లో తన తల్లితో కలిసి పడుకుని ఉండగా తనపై తోడేలు దాడి చేసింది. తోడేలు చిన్నారి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే చిన్నారి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లేచి దాన్ని తరిమికొట్టారు.
Wolf attack: ఉత్తర ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో తోడేళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తోడేళ్ల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో తోడేళ్ల దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖారీపైర్‌లోని ఛత్తర్‌పూర్‌లో సోమ, మంగళవారం మధ్యరాత్రి 3,6,9 ఏళ్లు కలిగిన ముగ్గురు పిల్లలపై దాడి చేసినట్లుగా అధికారులు తెలిపారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే తోడేళ్లు సమీపంలోని రాయ్‌పూర్ గ్రామానికి వెళ్లాయని, అక్కడ 5 ఏళ్ల చిన్నారిని ఇంటి నుంచి పట్టుకెళ్లాయని…