Wolf Attacks: పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర.. నరమాంస భక్షక తోడేళ్లను పట్టుకునేందుకు ప్లాన్..
- యూపీని భయపెడుతున్న నరమాంస భక్షక తోడేళ్లు..
- పిల్లలే టార్గెట్‌గా దాడులు చేస్తున్న తోడేళ్ల గుంపు..
- పట్టుకునేందుకు అధికారుల వ్యూహాలు..
- పిల్లల మూత్రంతో తడిపిన బొమ్మలతో ఎర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf Attacks: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలను కిల్లర్ తోడేళ్లు వణికిస్తున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు ఊళ్లపైపడి దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేస్తునున్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి సమయాల్లో తోడేళ్ల గుంపు ఇళ్లలోకి చొరబడి పిల్లల్ని ఈడ్చుకెళ్లి చంపి తింటున్నాయి. గత 50 రోజులుగా ఏడుగురు పిల్లల్ని, ఒక మహిళలను చంపేశాయి. మరో 25 మందిని గాయపరిచాయి. అయితే, ఈ తోడేళ్లను పట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం తంటాలు పడుతోంది. అనేక వ్యూహాలు అనుసరించి వీటిని ఊళ్లకు దూరంగా తరలించడం లేదా పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.
యుపి అటవీ శాఖ మరియు జిల్లా యంత్రాంగం 150 మంది అటవీ అధికారులతో సహా 250 మందికి పైగా సిబ్బందిని మోహరించింది. ఆగస్టు 29న ఎట్టకేలకు ఒక తోడేలుని బంధించారు. ఇప్పటి వరకు చిక్కుకున్న తోడేళ్ల సంఖ్య 4కి చేరింది. అయితే గుంపులో మరో రెండు తోడేళ్లు ఇప్పటి వరకు పట్టుబడలేదు. వీటి కోసం వేట కొనసాగుతోంది. వీటిని పట్టుకునేందుకు అధికారులు మూడు సెట్ల థర్మల్ డ్రోన్ కెమెరాలను, ఉచ్చులను వినియోగిస్తున్నారు. బహ్రైచ్ జిల్లా మహాసి తాహసీల్‌లోని వర్ది ప్రాంతంలో 25 నుంచి 30 గ్రామాల్లో నివసించే 50,000 మందికి ఈ తోడేళ్లు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: AP Rains and Floods: వరద బాధితులకు ఆహార పంపిణీ.. రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు..
ఇదిలా ఉంటే, అధికారులు సరికొత్త వ్యూహంతో ఈ తోడేళ్లను పట్టుకునేందుకు ముందుకు వచ్చారు. పిల్లలను పోలి ఉండే బొమ్మలను పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు తిరిగే ప్రాంతంలో పెడుతున్నారు. ఈ బొమ్మల్ని తోడేళ్లు తిరిగే నది ఒడ్డులు, గుహలు ఉన్న ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ‘‘తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తుంటాయి. సాధారణంగా రాత్రి వేళల్లో వేటాడుతాయి. మానవ సహజ వాసనలను అనుసరించేలా వాటిని తప్పుదారి పట్టించేలా బొమ్మలను పలు ప్రాంతాల్లో ఉంచి, వాటిని బోనులో బంధించాలని చూస్తున్నాం’’ అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు.
తరుచుగా పిల్లల్ని తోడేళ్లు లక్ష్యంగా చేసుకుంటుండటంతో బొమ్మల్ని పిల్లల్లా ఆకర్షించే రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో తోడేళ్లను తరిమేయడానికి బ్రిటీష్ వారు ప్రయత్నించారు. వాటిని చంపిని వారికి బహుమతుల్ని కూడా అందించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ తోడేళ్లు ఇదే ప్రాంతంలో జీవించగలిగాయి. ఆరు తోడేళ్ల సమూహం జూలై 17 నుంచి బహ్రైచ్ జిల్లాలో గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!