Business Headlines 02-03-23: ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి 2 రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. శుక్రవారం, శనివారం నిర్వహిస్తున్న ఈ సదస్సుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటంపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక వనరుల నుంచి పంప్డ్ స్టోరేజ్ పద్ధతిలో పవర్ జనరేట్ చేసే ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
One Man Two Jobs: ఒక ఉద్యోగి రెండు సంస్థల్లో పనిచేయటం సరికాదని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అది మోసంతో సమానమని అభిప్రాయపడ్డారు. మూన్‌లైటింగ్‌గా పేర్కొనే ఈ పథకానికి ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే.